కుటుంబంలోని మిగతా వారికి వైరస్ సోకకుండా కరోనా బాధితులు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఇంటి వాతావరణానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలపై కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, జిల్లా వైద్యాధికారి కోట చలం, సంబంధిత అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఆక్సిజన్ ప్లాంటును మరి కొద్ది రోజుల్లో నిర్మించనున్నట్లు వెల్లడించారు. తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించి కొవిడ్ వైద్యం ప్రారంభించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసు విచారణపై హైకోర్టులో రేవంత్ పిటిషన్