ETV Bharat / state

సమస్యలు పరిష్కరిస్తారు... గెలిపించండి: మంత్రి జగదీశ్​ రెడ్డి

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డికి మద్దతుగా మంత్రి జగదీశ్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్​పై మార్నింగ్ వాకర్స్​తో ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

jagadeesh reddy
jagadeesh reddy
author img

By

Published : Feb 19, 2021, 1:01 PM IST

ఆరేళ్లు ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నో పనులు చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతు బంధు అధ్యక్షుడిగానూ.. అన్నదాతల మేలుకోసం పాటుపడుతున్నారని తెలిపారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్‌పై పల్లాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారిని ఓట్లు అభ్యర్థించారు. పబ్లిక్‌ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.

ఉద్యోగులు, పట్టభద్రులకు పరిష్కార గొంతుగా ఉంటానని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగంపై కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పల్లా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ శాతం పెరిగితే రాష్ట్రంలో తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ఇదీ చదవండి : 'పరీక్షలో ఏదో ఒకటి రాసి పేపర్ నింపండి చాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.