Mayawati Election Campaign in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో.. రాజకీయ పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రతి నాయకుడు ఇంటి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. జాతీయ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. బీఎప్సీ(BSP) జాతీయ అధ్యక్షురాలు మాయావతి(Mayavathi) సూర్యాపేటలో నిర్వహించిన ఆ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
Mayavathi Public Meeting in Suryapet : ఉత్తరప్రదేశ్ మాదిరి తెలంగాణలో కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని మాయావతి కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)లు ప్రకటించినా.. వాటిని అమలు చేయట్లేదని విమర్శించారు. అంబేడ్కర్, కాన్షీరామ్ కలలను మనం సాకారం చేయాలని గుర్తు చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమీషన్ నివేదిక అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి, విపీ సింగ్ ప్రభుత్వం మేడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించిన ఘనత బీఎస్పీకే దక్కుతుందన్నారు.
బీఎస్పీ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి - 15 మందికి గాయాలు
Mayavathi Speech on OBC : ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో బీఎస్పీ పాత్ర కీలకమని మాయావతి చెప్పారు. దేశంలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించి సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీనేనన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్(Congress), బీజేపీల పాలనలో పేదల బతుకులు మారలేదని అసహనం వ్యక్తం చేశారు.
"యూపీ తరహాలో తెలంగాణలోనూ బీఎస్పీని ఆదరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్‌ను వదిలి మీ సేవ కోసం వచ్చారు. బీఎస్పీని దక్షిణాదిలోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ ప్రజలు వినూత్న తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాను."- మాయావతి, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు
Mayavathi Comments on BJP : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(rs praven kumar) ఐపీఎస్‌ను వదిలి.. ప్రజల సేవ కోసం వచ్చారని మాయావతి తెలిపారు. పార్టీని గెలిపించి.. ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. బీఎస్పీని దక్షిణాదిలోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వినూత్న తీర్పు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. దేశంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అణగారిన వర్గాలను అణిచివేసేందకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సంపన్న వర్గాల కోసం, సంపన్న వర్గాల చేత నడుపుతున్న పార్టీలు బీజేపి, కాంగ్రెస్‌లని ఆరోపించారు. రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రజల విరాళాలతో నడుపుతున్న పార్టీ బీఎస్పీయేనని తెలిపారు. మిగిలిన పార్టీలన్నీ ఓట్ల కోసం ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపడుతున్నారని ఆరోపించారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిర్పూర్‌ను అగ్రస్థానంలో నిలబెడతా : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్