సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో అతిపురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.
అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తారని... భక్తులకు మాత్రం దర్శనానికి అనుమతి లేదని వెల‌్లడించారు. గుంపులు గుంపులుగా ప్రజలు చేరకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు మేరకు దేవాలయంలో అన్ని సేవలు రద్దు చేశామన్నారు.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు