ETV Bharat / state

పెళ్లికి వెళ్లాలి పంపించండి సార్.. సరిహద్దుల్లో తప్పని తిప్పలు.! - marriage vehicle waiting at ramapuram checkpost

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలు కావడంతో పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు.. ఇతర రాష్ట్రాల వారిని తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి రాష్ట్రానికి పెళ్లికి వస్తున్న వారిని పోలీసులు అనుమతించలేదు. గంటసేపు బతిమిలాడిన అనంతరం వారిని అనుమతించారు.

marriage vehicle was stopped at ramapuram checkpost
రామాపురం చెక్​పోస్ట్​ వద్ద పెళ్లి వాహనం సమస్యలు
author img

By

Published : May 12, 2021, 1:29 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని రామాపురం క్రాస్​రోడ్ వద్ద చెక్​పోస్ట్ మూసివేయడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాష్ట్రంలో లాక్​డౌన్​ నిబంధనల దృష్ట్యా ఏపీలోని కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండంలో పెళ్లికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకున్న అనుమతి పత్రం చూపించినా.. పోలీసులు నిరాకరించారని బంధువులు వాపోతున్నారు. గంటసేపు ఎండలో బతిమిలాడుతూ తీవ్ర ఇబ్బందులు పడిన తర్వాత ఎట్టకేలకు పెళ్లికి వెళ్లడానికి పోలీసులు అంగీకరించారు. దీంతో పెళ్లి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: నర్సుల సేవలు, త్యాగం మరువలేనివి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.