సూర్యాపేట జిల్లా నేరేడు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందె చిన్న మల్లయ్య పార్థివ దేహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. పార్టీ జెండా కప్పి సంతాపం తెలిపారు. మల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మండలంలో ఆయన పేరు మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మల్లయ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : గోదావరిలో వ్యర్థాల విడుదలపై సుమోటో కేసు నమోదు...