Mahashivratri celebrations in Mellacheruvu of Suryapet district: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో రెండవ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాలు 22వ తారీఖున పవళింపు సేవ కార్యక్రమంతో ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలలో ఈరోజు నుంచి 22వ తారీకు వరకు వృషభ రాజుల బండలాగు ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. బండలాగు ప్రదర్శనలు ఆరు విభాగాలలో జరుగుతాయని, ఈరోజు రెండు పళ్ల విభాగానికి చెందిన వృషభ రాజుల ఎద్దులు పోటీ ఉంటుందని ఇందులో సుమారు 18 ఎద్దుల జతలు పాల్గొంటాయని తెలిపారు.
సీనియర్ విభాగానికి చెందిన ఎద్దులు 22వ తారీఖున జరుగుతాయని పోటీలలో గెలుపొందిన వాటికి మొదటి బహుమతిగా 45 హెచ్పీ ట్రాక్టర్ ఇస్తామని వెల్లడించారు. దీనిలో రెండవ బహుమతిగా మూడు లక్షల రూపాయలు విలువైన బుల్లెట్ బైక్ ఇస్తామని తెలిపారు. ఈ ఎద్దుల పోటీలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎద్దులు పాల్గొంటాయన్నారు.
"మొదటిరోజు అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి కల్యాణం జరిగింది. అలంకరణతో పాటు రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవాలయానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ ఉత్సవాలకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాము. బండలాగు ఎడ్లపందెలను నిర్వహిస్తున్నాము".-ఈవో కొండ రెడ్డి
ఇవీ చదవండి: