లాక్డౌన్ అమలు సందర్భంగా మానసిక వికలాంగులకు, వృద్ధులకు, నిరాశ్రయులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి సేవాగుణాన్ని చాటుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు కూరగాయలను తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అందించారు. పట్టణంలోని పోలీసులు నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాలకు, దురాజుపల్లి గ్రామంలోని వృధాశ్రమానికి, మానసిక వికలాంగుల ఆశ్రమానికి సరుకులను అందించారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం