యాదవులు తమ ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామి జాతర... అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న రాత్రి కేసారం నుంచి పెద్దగుట్టకు దేవరపెట్టె తరలిరావడంతో... ప్రత్యేక పూజల అనంతరం జాతర మొదలైంది. గంపలు నెత్తినెత్తుకొని బోనాలు సమర్పించేందుకు... భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం... మొక్కులు చెల్లించుకున్నారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు... పోటీ పడుతున్నారు.
హైదరాబాద్ విజయవాడ రహదారిని ఒకవైపు మూసివేసి... భక్తులను అనుమతిస్తున్నారు. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా భావించే గొల్లగట్టు వేడుకల్లో సంప్రదాయ డోలు వాద్యాలు, బేరీల చప్పుళ్లతో గుట్ట పరిసరాలు మార్మోగుతున్నాయి.
మహిళల భద్రత కోసం షీ టీంలు, నిఘా కోసం సీసీ కెమెరాలు... 1,400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు నోడల్ అధికారులను నియమించారు. 12 జోన్లకు గాను 21 మంది అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జాతర ప్రాంగణం చుట్టూ ఏడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: ఈ నెల 15 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు