సాదాబైనామా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్ తెలిపారు. జిల్లాలోని తుంగతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి, రిజిస్ట్రేషన్ విధానాన్ని సిబ్బందికి వివరించారు.
2014 ముందు భూములకు తప్పనిసరిగా ధరణిలోనే వివరాలు పొందుపరచాలన్నారు. సాదాబైనామాలకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ చివరి అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్ప, ఆర్ఐ మహమ్మద్ అలీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.