సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పేద విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించారు. కరోనా వ్యాప్తి వల్ల ఇంటికే పరిమితమైన విద్యార్థులు ఆన్లైన్ తరగతులు హాజరయ్యేందుకు పది ప్రభుత్వ పాఠశాలలకు ల్యాప్టాప్లు అందజేసి, సాయం చేసిన చేతన ఫౌండేషన్ను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టి పేదల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
పేదలకు సాయం చేయడంలో చేతన ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఫౌండేషన్ సభ్యుడు సీతారామరావు అన్నారు. తమ చదువుకు అడ్డంకి రాకుండా ల్యాప్టాప్లను అందజేసిన చేతన ఫౌండేషన్ పేద విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చూడండి : ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే విజయం: లక్ష్మణ్