తెరాస ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వివరించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
110 మందికి రూ. కోటి 11 లక్షల విలువగల చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే కడుపున పెట్టుకుని చూసుకునే విధంగా తెరాస పథకాలు ఉన్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన