సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రచారం నిర్వహించారు. 27వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాబుద్దీన్ తరఫున ఇంటిటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోదాడలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుందని పద్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: నల్లగొండ మున్సిపాలిటీల్లో అగ్రనేతల ప్రచారజోరు..