మహమ్మారి కరోనాను పారద్రోలేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూలో ఉమ్మడి నల్గొండ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. కరోనా కట్టడే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు.. జిల్లాలోని అన్ని వ్యాపార, వర్తక దుకాణాలు మూతపడ్డాయి.
ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు