ETV Bharat / state

'అందరూ పిల్లలను కంటారు... నేను దేశభక్తుడిని కన్నాను' - కల్నల్ సంతోష్‌బాబు

'తల్లయ్యే అదృష్టం ఎందరికో దక్కుతుంది. నాకు మాత్రం దేశభక్తుడిని కన్న తృప్తి ఉంది. కొడుకు చనిపోయాడని బాధగా ఉన్నా.. దేశం రక్షణ కోసం ప్రాణాలు విడవడం నాకు దక్కిన ఓదార్పు’ అంటున్నారు గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో సోమవారం జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు మాతృమూర్తి బిక్కుమళ్ల మంజుల. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు.. చనిపోయినప్పుడు ఆ చావుకు ఒక అర్థం ఉండాలని తన కొడుకు ఎప్పుడూ చెప్పేవాడంటున్న ఆమెను ‘వసుంధర’ పలకరించింది.

colonel santhosh babau
colonel santhosh babau
author img

By

Published : Jun 18, 2020, 11:34 AM IST

చిన్నప్పటి నుంచీ వాడికి సైన్యంలో పనిచేయాలనే కోరిక. ఆ ఆశయం వాడి తండ్రి నుంచి వచ్చింది. తండ్రి కోసమే సైన్యంలో చేరాలని అనుకున్నా...ఎదిగే కొద్దీ దేశానికి సేవ చేయాలనే కోరిక నరనరానా వాడిలో జీర్ణించుకుపోయింది. నా కొడుకు చాలా తెలివైనవాడు. ఆర్మీలోకి వెళ్లాలని చాలా కష్టపడ్డాడు. సామాజిక సమస్యలు, కుటుంబ బంధాల విషయంలో చాలా సున్నిత మనస్కుడు. సంతోష్‌ పేరుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి తను సంతోషంగా ఉంటూ.. తన చుట్టూ వారిని కూడా సంతోషంగా ఉంచేవాడు.

ఐదో తరగతి వరకు సూర్యాపేటలో చదువుకున్నాడు. ఆరు నుంచి కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ఆ తర్వాత ఎన్‌డీఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ)లో చదివాడు. 2004లో సైన్యంలో చేరిననాడే అన్నింటికీ సిద్ధమయ్యే వెళ్లాడు. మాకు ఒక్కగానొక్క కొడుకే అయినా ధైర్యంగానే పంపించాం. ‘ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఎలా?’ అని అడిగితే ‘నాకేం కాదమ్మా! రోడ్డుపై వెళుతుంటే ప్రమాదాలు జరగవా? కాదూ... యుద్ధమే వచ్చి ప్రాణాలు పోతే అంటావా.. దేశం కోసం మరణించడం గర్వపడే విషయమే కదా. నీకు గొప్పపేరు రావడం నాకు తృప్తి’ అనేవాడు.

(కళ్లల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ) దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదంటూడేవాడు. అలా వచ్చిన తర్వాత మనసా, వాచా, కర్మణా చివరి నిమిషం వరకూ దేశ భద్రతకే కట్టుబడ్డాడు. మా కోడలు బంధువులమ్మాయే. మాతో కలివిడిగా ఉంటుంది. నాకు కొడుకు మాత్రమే దూరమయ్యాడు. నా కోడలికి జీవితమే శూన్యమైంది. ఇంత చిన్న వయసులో తనకు వచ్చిన కష్టానికి గుండె తరుక్కుపోతోంది.

రెండునెలల్లో వచ్చేవాడు..

గతేడాది మార్చిలో నా బిడ్డ ఇంటికి వచ్చాడు. దిల్లీకి రాజైనా.. తల్లికి బిడ్డేకదా! మా వాడూ అంతే ఆర్మీలో ఎంత పెద్ద ర్యాంకులో ఉన్నా ‘అమ్మా అమ్మా’ అంటూ చిన్నపిల్లాడిలా నా చుట్టూ తిరిగేవాడు. చిన్నప్పటి నుంచి స్వీట్స్‌, కేక్స్‌ అంటే ఎంతో ఇష్టం. ప్రతి పుట్టినరోజుకీ ఇంటికి వచ్చేలా ప్లాన్‌ చేసుకునేవాడు. ఆర్మీలో చేరిన తరువాత కూడా ఇంటికొచ్చినప్పుడల్లా కేక్‌ తయారు చేయమనేవాడు. నాకు కాస్త పని ఎక్కువైనా, ఏ విషయంలోనైనా ఇబ్బంది పడినా...అస్సలు తట్టుకునే వాడు కాదు.

నేను వంటింట్లో వంట చేస్తుంటే ఎంతో సాయం చేసేవాడు. లద్దాఖ్‌లో పరిస్థితులు ఇక్కడిలా ఉండకపోవడంతో స్వీట్స్‌ తినడం చాలా రోజుల ముందు నుంచే మానేశాడు. మా అమ్మాయి (శ్రుతి) పిల్లలతో ఆటలు అంటే సంతోష్‌కి చాలా సరదా. తన కూతురు (అభిజ్ఞ)పుట్టిన నెల రోజులకే పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పనిచేయడానికి వెళ్లాడు. దాదాపు ఐదేళ్ల వరకు ఇంటికే రాలేదు. ఇంటికి వచ్చినప్పుడల్లా తన కూతురుతోనే ఎక్కువగా గడిపేవాడు. ఇప్పుడు వాడి కొడుక్కి మూడేళ్లు. నా కొడుకు నా దగ్గర పదేళ్ల వరకైనా ఉన్నాడు. వాడి కొడుకు దగ్గర మాత్రం ఏడాది కూడా ఉండలేదు. మరో రెండు నెలల్లో హైదరాబాద్‌కు బదిలీ అయితే అందరూ సంతోషంగా ఉండాలనుకున్నాం.

మూడ్రోజులు నీళ్లే ఆహారంగా..

ఏ మాత్రం వీలు కుదిరినా ఫోన్‌ చేసేవాడు. అప్పుడు వృత్తిరీత్యా ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏంటనేదీ అస్సలు చెప్పేవాడు కాదు.‘‘ నేను బాగున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త’’ ఎప్పుడూ ఫోన్‌ చేసినా ఇంతే. దీంతో మేము కూడా ఎక్కడున్నావ్‌ అని అడిగేవాళ్లం కాదు. ఇక్కడికి వచ్చాక ఎంత వరకు చెప్పాలో అంత వరకు అక్కడి పరిస్థితులను చెప్పేవాడు.

2007లో కశ్మీర్‌లోని కుప్వారాలో పనిచేస్తున్నప్పుడు పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి వచ్చిన చొరబాటుదారులను కాల్చివేసేందుకు జరిగిన ఎన్‌కౌంటర్‌ దాదాపు మూడు రోజుల పాటూ కొనసాగిందని చెప్పాడు. ఆ మూడు రోజులూ నీళ్లే తాగాడట. అయితే ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు అని మాత్రమే చెప్పడంతో పాకిస్థాన్‌ సరిహద్దు కంటే ప్రమాదం కొంచెం తక్కువగా ఉంటుందనుకున్నాం. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదు.
ఇదీ చదవండి: తల్లి ఒడిలో.. దేశ రక్షణలో.. మరిచిపోని జ్ఞాపకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.