తెరాస ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని... హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ప్రజలు ఆయన మాటను విశ్వసించే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని కొన్నాయిగుడెం, సింగారం గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.
కొన్నాయిగుడెం సర్పంచ్, సింగారం తెదేపా కార్యకర్తలంతా తెరాసలో చేరడం చాలా సంతోషకరమని సైదిరెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలతో పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతోనే చాలామంది తెరాసలో చేరుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: 'బుల్లెట్ సైలెన్సర్ మార్చారో.. మీ బైక్ స్టేషన్‌కే'