సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మహమ్మద్ రుబీనా బేగం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో భాదపడుతోంది. రెండేళ్లుగా ఆమె భర్త బతుకుదెరువుకు సౌదీ వెళ్లి ఉంటున్నాడు. తనకు ఆరోగ్యం బాలేని సమయంలో భర్త తోడుగా లేరని భావించిన రుబీనా భావోద్వేగానికై గురైంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తుంగతుర్తి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి : 'దానికి కూడా హ్యాట్సాప్ చెబుతావా జగన్..'