వాయుగుండం ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఏకధాటి వర్షానికి హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో ఎర్ర వాగు పొంగి పొర్లుతోంది. వరద నీరు రోడ్డుపైకి వచ్చి రాకపోకలు నిలిచిపోయాయి.
ఎర్ర వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న వర్షం కురిసినా వాగు పొంగి... ఫలితంగా పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: వాగు దాటాలి.. విద్యార్థులను చేరాలి..