ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 బస్సులను నడుపుతున్నామని.. అవసరాన్ని బట్టి మరిన్ని సమకూరుస్తామని నల్గొండ రీజనల్ ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. వికలాంగులకు ప్రయాణ రుసుములో 50శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసుల బందోబస్తు
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వెయ్యి మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిని రెండు భాగాలుగా విభజించి వచ్చి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు జాతర జరగనుంది. ఏటా 8 నుంచి 10 లక్షల మంది తరలిరాగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:పారదర్శకత కోసమే...