సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామిని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని..ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుని వెళ్తానని అన్నారు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని.. భవిష్యత్లో ఏ స్థాయిలో ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఇవీ చూడండి : 'దోమకాటుకు 20 కోట్ల మంది మృతి'