ETV Bharat / state

ఇద్దరు వ్యక్తులపై భౌతికదాడికి పాల్పడిన గ్రామసర్పంచ్​ - sarpanch

గ్రామసర్పంచ్​ భౌతిక దాడికి పాల్పడి ఇద్దరు వ్యక్తులను గాయపరిచిన సంఘటన సూర్యాపేట జిల్లా దుబ్బ తండాలో జరిగింది. బాధితులు నాగారం పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

Gramsarpanch  physically assaulted two persons in suryapet district
ఇద్దరు వ్యక్తులపై భౌతికదాడికి పాల్పడిన గ్రామసర్పంచ్​
author img

By

Published : Aug 27, 2020, 11:21 PM IST

పండుగ ఘర్షణలో సామాన్యులపై గ్రామ సర్పంచ్​ భౌతిక దాడికి పాల్పడి ఇద్దరు వ్యక్తులను గాయపరిచిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నరసింహులగూడెం ఆవాసం దుబ్బ తండాలో చోటుచేసుకుంది. తీజ్ పండుగ వేడుకల్లో డప్పు పగిలిన విషయంపై తనకు గ్రామ సర్పంచ్ గణేష్​కు వాగ్వాదం జరిగిందని బాధితుడు జాటోత్​ గణేష్​ తెలిపారు.

తాగిన మైకంలో ఉన్న సర్పంచ్ గణేష్ దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ విషయమై నాగారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసి గ్రామానికి తిరిగి వెళ్తుండగా సర్పంచ్ తన అనుచరులతో కలిసి అడ్డగించి తన తమ్ముడైన జాటోత్ భాస్కర్​ను గొడ్డలి, రాళ్లతో దాడి చేయడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. తమపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన సర్పంచ్ గణేష్​పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై సర్పంచ్​ను వివరణ కోరగా.. తాను దాడికి పాల్పడలేదని జాటోత్ గణేష్, అతని కుటుంబ సభ్యులు అకారణంగా తననే దూషిస్తూ తన చుట్టూ తిరుగుతూ తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు.

ఇవీ చూడండి: రూ.2 లక్షల 57 వేల విలువైన గుట్కాను పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.