ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చురుగ్గా సాగుతున్న ధాన్యం సేకరణ

author img

By

Published : Apr 30, 2021, 4:17 AM IST

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆశించిన రీతిలో ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఒక మిల్లుపై నమోదైన పోలీసు కేసుతో మిల్లర్లు బెట్టు చేసి రెండురోజుల పాటు దిగుమతులు నిలిపివేశారు. మరోవైపు తాలు పేరిట రైతులను మోసం చేస్తున్న ఘటన తిప్పర్తి కొనుగోలు కేంద్రంలో వెలుగుచూసింది.

ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లు

కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు పోటాపోటీగా ధాన్యం కొంటుండగా.. యాదాద్రి జిల్లాలో ప్రక్రియ నిదానంగా సాగుతోంది. 15 రోజుల గణాంకాల్ని పరిశీలిస్తే నల్గొండ, సూర్యాపేట జిల్లాలు రాష్ట్రంలోనే రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాణ్యమైన సరకు తీసుకురావాలన్న నిబంధతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా తాలు పేరిట 41 కిలోల సంచిలో 45 కిలోలకు పైగా తూకం వేస్తూ.. రైతులను నిలువునా ముంచుతున్న వైనం తిప్పర్తిలో బయటపడింది. ఒక్కో సంచికి 4 కిలోలకు పైగా వడ్లను అదనంగా తీసుకోవడంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలులో జాప్యంపైనా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. తాలు విషయంలో రైతులు, అధికారులు, మిల్లర్ల మధ్య పేచీ నడుస్తోంది. కొన్ని కేంద్రాల్లో తాలు పేరిట క్వింటాలుకు అదనంగా ధాన్యం తీసుకుంటుండగా.. రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎందుకులే గొడవ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

చింతపల్లి మండలం నసర్లపల్లి రైస్ మిల్లును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేయడం వివాదానికి దారితీసింది. నిరసనగా నల్గొండ జిల్లాలోని మిల్లర్ల సంఘం 50 మిల్లుల్లో దిగుమతుల్ని నిలిపివేసింది. అధికారులు వారితో చర్చలు జరిపి తిరిగి యథావిధిగా రవాణా సాగేలా చర్యలు తీసుకున్నారు. అనుకున్న లక్ష్యంలో ఇప్పటిదాకా 30 శాతం కొన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ విభాగాల్లోని శాఖల్లో.. సమన్వయం కొరవడుతోంది. కీలక సమయంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని యంత్రాంగం భావిస్తోంది. అందుకే సమస్యను త్వరగా పరిష్కరించింది.

ఇదీ చూడండి: 'కరోనా బాధితులను రెండు గంటలకోసారి పర్యవేక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.