ETV Bharat / state

నిరుద్యోగులు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు: కోదండరాం

నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులు ఉపాధి లేక కూలీ పనులకు వెళ్తున్నారని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.

govt neglect unemployed youth in the state say kodanda ram in suryapeta dist
నిరుద్యోగులు ఉపాధిహామీ పనికి వెళ్తున్నారు : కోదండరాం
author img

By

Published : Dec 19, 2020, 10:19 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇవ్వకపోవడంతో ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పట్టభద్రుల సమావేశం నిర్వహించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ హామీలను మరిచిపోయారని అన్నారు. రాబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు మాండ్ర మల్లయ్య, ఐఎఫ్​టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ప్రైవేట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు చందు, శ్రీధర్, మండల కన్వీనర్ చెవ్వు శ్రీను, ప్రియాంకర్, యాసిన్, అనిల్, నరేష్, సందీప్, యూనస్, స్వామి, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సచివాలయ పనులు వేగవంతం.. భారీ చెట్ల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.