ETV Bharat / state

సూర్యాపేట జిల్లా చెరువుల్లోకి గోదావరి జలాలు - latest news of suryapet water issue on kcr decision

సూర్యాపేట సాగునీటి సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ఆదేశించారు.

సూర్యాపేట చెరువుల్లో గోదావరి జలాలు
author img

By

Published : Nov 11, 2019, 1:23 PM IST

తీవ్ర నీటి ఎద్దడి ఉండే సూర్యాపేట జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గత 20 రోజులుగా గోదావరి జలాలను సూర్యాపేట జిల్లా వరకు తరలిస్తున్నారు. నీటి ప్రవాహం ఎలా ఉంది? చెరువులు నింపుతున్న తీరు, ఇంకా నీటి విడుదల జరగాల్సిన రోజులు? తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ఆరా తీశారు.

గోదావరి జలాలపై మంత్రి జగదీశ్ రెడ్డితో ముఖ్యమంత్రి మాట్లాడారు. చెరువులు నింపుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నీటికి కొరత లేదని.. ఎన్ని రోజులైనా గోదావరి జలాలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జిల్లాలోని చెరువులన్ని నింపాలని సీఎం చెప్పారు. చెరువులు నింపడానికి అనుగుణంగా కాల్వలకు అవసరమైన చోట మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇదీ చూడండి: ఉద్యోగులకు శుభవార్త... 11వ పీఆర్సీ అమలు దిశగా అడుగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.