భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా వరదమయమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నుంచి తేరుకోలేదు. మఠంపల్లి మండలంలోని మట్టపల్లి నృసింహస్వామి ఆలయంలోకి భారీ వరద నీరు చేరింది. కరకట్ట నుంచి దేవస్థానంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
ఆలయంలోని ఉత్సవమూర్తుల విగ్రహాలు, హుండీలను నిర్వాహకులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. గ్రామంలోనూ వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతుండటం వల్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఇళ్లపైనే ఉంటున్నారు.