రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడం... దీనికి తోడు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా వరద ఇళ్లల్లోకి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.
దీనకి తోడు మొసళ్లు, పాములు, చిన్న చిన్న పురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయని... చిన్న పిల్లలతో ఇంట్లో ఉండాలంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో వర్షం.. నిండుకుండను తలపిస్తున్న చెరువులు