సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తోన్న తేలికపాటి జల్లులకు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాలు పెట్టేందుకు దుక్కులు దున్నటం మొదలుపెట్టారు.
కోదాడ పట్టణంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతగా ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలంతా ఉపశమనం పొందుతున్నారు.
ఇదీ చదవండి: Bear: చింతచెట్టుపై ఎలుగుబంటి.. మత్తుమందు ఇచ్చి బంధించి..