సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పురపాలిక పరిధిలోని కల్లూరు గ్రామ పేదలకు నిత్యావసరాలు పంచిపెట్టారు. అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నాగరాజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజల ఆకలి తీర్చేందుకే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు సహకరిస్తున్న వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు : మంత్రి నిరంజన్ రెడ్డి