రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బీమా పథకం అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. జూన్ 6, 2020 తేదీకి ముందు కొత్త పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు, ఈ పథకానికి అర్హత కలిగి ఉండి, దరఖాస్తు చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఇందుకు రైతులు వారి కొత్త పాసు పుస్తకం జిరాక్స్, ఎమ్మార్వో కార్యాలయం నుంచి డ్రాఫ్ట్ కాపీ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్లను మండల వ్యవసాయ అధికారులకు ఈనెల 18లోపు సమర్పించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.