ETV Bharat / state

కొరవడిన చి(చె)త్త శుద్ధి

author img

By

Published : Jul 16, 2019, 12:05 PM IST

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా పల్లెల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని నిధులు కూడా అందిస్తోంది. అయితే ప్రతి పల్లెను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఉపాధి హామీ పథకంలో చెత్త డంపింగ్‌యార్డుల నిర్మాణాలకు పూనుకుంది. ఇందుకు రూ.కోట్ల నిధులను వెచ్చించింది. ఇందులో కొన్ని పూర్తికాగా మరికొన్ని పూర్తికాకుండానే వదిలేశారు.

కొరవడిన చి(చె)త్త శుద్ధి

స్వచ్ఛభారత్ కోసం రూ. కోట్ల నిధులు కేటాయిస్తున్నా.. స్వచ్ఛత మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. చెత్త చెదారం, ఇతర వ్యర్థాలను నిర్జన ప్రదేశాల్లో, పాడుబడిన ఇళ్లమధ్య వేస్తున్నారు. ఫలితంగా పల్లెలు మురికికూపాలుగా మారుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తైన వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పంచాయతీలు, అధికారులు విఫలమవుతున్నాయి. వాటిల్లో చెత్తను వేయించాలనే ధ్యాస సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బందికి కొరవడింది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడంలేదు. నూతన పంచాయతీ పాలకవర్గం ఇటీవల బాధ్యతలు చేపట్టడం, వందల సంఖ్యలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం అయినందున దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పూర్తి కాని డంపింగ్ యార్డుల నిర్మాణం
పూర్వ నల్గొండ జిల్లాలో మొత్తం 901 డంపింగ్‌యార్డులు మంజూరుకాగా వాటిల్లో సుమారు 338 మాత్రమే పూర్తయినట్లుగా అధికారవర్గాలు లెక్కలు చెబుతున్నాయి. మరో 216 వివిధ దశల్లో ఉండగా, 347 డంపింగ్‌యార్డులను పలు సమస్యల కారణంగా ప్రారంభించనే లేదు. ఇప్పటి వరకు వీటి నిర్మాణాల కోసం రూ.4.60 కోట్లు ఖర్చుచేశారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన వీటి వినియోగంపట్ల ఆయా వర్గాలవారిలో చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి.

నిర్మించినా వినియోగంలోకి రానివైనం..
గ్రామాల్లో చెత్తచెదారం పేరుకుపోయి పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. చెత్తను తరలించడానికి గ్రామాల్లో డంపింగ్‌యార్డులు లేకపోవడంతో నివాస గృహాలు, పాడుబడిన గృహాల మధ్యనే చెత్తవ్యర్థాలను వేస్తుండటంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఏర్పడిన సందర్భాలున్నాయి. ఫలితంగా దోమలకుతోడు దుర్వాసన పర్యవసానంగా రోగాలు వ్యాప్తిచెందడం సర్వసాధారణంగా మారింది. ఈ సమస్యల నివారణ కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో డంపింగ్‌యార్డులను నిర్మించినా వినియోగంలోకి రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

కొన్ని గ్రామాలకు ట్రాక్టర్‌ వాహనాలు లేకపోవడం, ఉన్న త్రిచక్ర వాహనాల ద్వారా చెత్తవ్యర్థాలను తీసుకెళ్లి పారబోయాలనే ధ్యాస లేకపోవడం వల్ల నిర్మించినా ఇబ్బందులు తప్పడంలేదు. డంపింగ్‌యార్డుల నిర్మాణాలను పూర్తిచేసిన కొన్ని ప్రాంతాల్లో పరిసర వాసుల అభ్యంతరాలవల్ల అవి నిరుపయోగంగానే ఉన్నాయి. అధికారులు చొరవచూపి చెత్తడంపింగ్‌ యార్డులకు వ్యర్థాలను తరలించేలా సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.