సూర్యాపేట జిల్లాలో లింగమంతులస్వామి జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని, చౌడమ్మ దేవిని దర్శించుకునేందుకు దూరాజ్‌పల్లి గుట్టకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. గంటగంటకూ పోటెత్తుతున్న భక్తజనంతో.. ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
మంత్రులు తలసాని శ్రీనివాస్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతర కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
మరోవైపు జాతరకు తరలివస్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోవడంతో... ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి: సూర్యాపేట వద్ద హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జాం