ETV Bharat / state

కన్న రుణం: తండ్రికి కూతుళ్ల తలకొరివి - suryapeta funeral conducted by daughters

మోత్కూర్ మండలం భుజిలపురానికి చెందిన చింతల సత్యనారాయణ రెడ్డి గుండెపోటుతో ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో తన ఇద్దరు కూతుళ్లు తండ్రికి తలకొరివి పెట్టి కన్న రుణం తీర్చుకున్నారు. ఆయన మృతికి పలువురు నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Daughters who conducted the funeral for the father in suryapeta district
తలకొరివి పెట్టి కన్న రుణం తీర్చుకున్న కూతుళ్లు
author img

By

Published : Dec 6, 2020, 8:26 PM IST

తండ్రికి తన ఇద్దరు కూతుళ్లు తలకొరివి పెట్టి కన్న రుణం తీర్చుకున్న ఘటన సూర్యాపేట జిల్లా మోత్కూర్ మండలం భుజిలపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతల సత్యనారాయణ రెడ్డి (57) గురువారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్​లోని ప్రైవేట్​ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో తన ఇద్దరు కూతుళ్లే అంత్యక్రియలు నిర్వహించారు.

సత్యనారాయణ రెడ్డి ఇండియన్ రెడ్​క్రాస్ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్​గా విధులు నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్నో రక్తదాన శిబిరాలను నిర్వహించి.. వేలాది యూనిట్ల రక్తాన్ని సత్యనారాయణ రెడ్డి సేకరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అధికంగా రక్తదాన శిబిరాలను నిర్వహించినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్​చే ప్రశంసలు అందుకున్నారు. మోత్కూర్, గుండాల, అడ్డగుడూరు, ఆత్మకూరు మండలాల్లో ఫార్మాసిస్ట్​గా ఆయన విధులు నిర్వర్తించారు.

ఇద్దరు కూతుళ్లు వివాహం చేసుకొని ఒకరు అమెరికాలో, మరోకరు హైదరాబాద్​లో స్థిరపడ్డారు. మృతుడి భార్య అరుణ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. ఆయన మృతికి పలువురు నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి: ఆటోను ఢీకొన్న టిప్పర్...డ్రైవర్​కు తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.