సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో మొసళ్లు హల్చల్ చేస్తున్నాయి. పది రోజుల క్రితం వరద నీరు రావడం వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సాగర్ నుంచి వరద ఉద్ధృతి లేనందున మొసళ్లు సంచరిస్తున్నాయి. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకులకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఒక మొసలి రోడ్డుపై సంచరిస్తుండగా అటుగా వచ్చిన భారీ వాహనం పై నుంచి వెళ్లడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. మొసలి చనిపోయిన సమాచారాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు.
ఇదీ చూడండి: గోకుల్ చాట్, లుంబినీపార్కు రక్తపుధారకు 12 ఏళ్లు