ETV Bharat / state

FAKE SEEDS: రూ.13.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం - counterfeit seeds seized in adilabad district

ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దమొత్తంలో విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో మరోసారి భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. రాష్ట్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసే నకిలీ పత్తివిత్తనాలు (Fake seeds) బయట పడుతున్నాయి. తాజాగా సుమారు రూ.13.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.13.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

author img

By

Published : Jun 11, 2021, 5:19 AM IST

Updated : Jun 11, 2021, 5:35 AM IST

నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసగిస్తున్న ముఠాల బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. సూర్యాపేట, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తనిఖీలు చేపట్టి భారీగా స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటలో ఆరుగురు నిందితుల ముఠాను అక్కడి పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.13.5 కోట్ల విలువైన 986 కిలోల విత్తనాలు, రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మిరప విత్తనాల విలువే రూ.10.93 కోట్లని పోలీసులు తెలిపారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో దాడులు చేపట్టి రూ.24 లక్షల విలువ చేసే విత్తనాలను పట్టుకొన్నారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం కేంద్రంగా అనంతపురం జిల్లాకు చెందిన మూలపాటి శివారెడ్డి ‘ద్వారకా’ సీడ్స్‌ పేరుతో కొంతకాలంగా విత్తనాలను అమ్ముతున్నారు. లైసెన్స్‌ లేని వారిని డీలర్లుగా నియమించుకుని కాలం చెల్లిన విత్తనాలు, లూజు విత్తనాలను లేబుళ్లు, లాట్‌ నంబరు లేకుండా ప్రభుత్వ ప్రమాణాలను ఉల్లంఘించి, వివిధ బ్రాండ్ల పేరుతో రైతులకు అంటగడుతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్నారంటూ రెండు రోజుల కిందట కొందరు రైతులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్థానిక డీలర్‌ జగన్మోహన్‌రావును విచారించారు.

మహబూబాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సుజాతనగర్‌, వైరా ప్రాంతాల్లో డీలర్లను నియమించుకొని విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విచారణలో తేలింది. ఈ మేరకు వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, వనస్థలిపురంలోని ఓ ఇంట్లో 986 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా సీడ్స్‌ ఎండీ శివారెడ్డి, ఇతడికి సహకరిస్తున్న ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఈ కంపెనీ రెండు రాష్ట్రాల రీజినల్‌నేజర్‌వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి ప్రతాప్‌కుమార్‌, సిద్దిపేట జిల్లాకు చెందిన సూకురి యాదగిరి, స్థానిక డీలర్‌ జగన్మోహన్‌రావులను అరెస్ట్‌ చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ గురువారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
ఐదు దుకాణాలపై కేసులు..
ఆదిలాబాద్‌ జిల్లాలో పలువురు డీలర్లు అసలు ధరలు చెరిపేసి, లాట్‌నంబర్లు మార్చి రైతులను మోసం చేస్తున్నారంటూ ఈ నెల 9న ‘ధరలు మార్చి.. రైతులను ఏమార్చి’ అనే శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మంత్రి టాస్స్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయించారు. ఆ బృందాలు తనిఖీలు చేపట్టాయని.. ఇచ్చోడలోని శ్రీవాసవి ట్రేడర్స్‌లో రూ.7,30,351 విలువైన ప్యాకెట్లను, సహారా అగ్రో ఏజెన్సీస్‌లో రూ.72,098, రంజిత్‌ ట్రేడర్స్‌లో రూ.15,26,330, గుడిహత్నూర్‌లోని శ్రీ సాయికృష్ణ అగ్రి దుకాణంలో రూ.36,049, శివసాయి అగ్రోఏజెన్సీలో రూ.39,884 విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని గురువారం డీఎస్పీ ఉదయ్‌రెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి: Minister Niranjan: 'పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించండి'

Last Updated : Jun 11, 2021, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.