ETV Bharat / state

సూర్యాపేటలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - సూర్యాపేటలో కరోనా కేసుల తాజా వార్త

సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య... విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్​ కేసులతో రికార్డు సృష్టిస్తోంది.

corona latest updates in suryapeta
సూర్యాపేటలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Apr 22, 2020, 4:48 AM IST

సూర్యాపేట జిల్లాలో నిన్న ఒక్కరోజే 26 కేసులు బయటపడటం... వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్ధం పడుతోంది. వీటితో కలిపి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 80 కేసులు నమోదు కాగా... ఉమ్మడి జిల్లా పరంగా వాటి సంఖ్య 95కు చేరుకుంది. ఇప్పటి వరకు 796 నమూనాలను పరీక్షలకు పంపగా... ఇంకా 191 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

210 మంది ప్రభుత్వ క్వారంటైన్లలో... 4 వేల 346 మంది హోం క్వారంటైన్లలో ఉన్నారు. ఈ నెల 2న ఒక కేసుతో మొదలైన పరంపర... అంతకంతకూ రెట్టింపవుతూనే ఉంది. ఈ నెల 8న 11... 16న 16 కేసులు, 17న 15 పాజిటివ్​ కేసులు నిర్ధరణ కావడం... వరుసగా రెండ్రోజుల్లోనే 31 కేసులు నమోదైన తీరు ప్రమాద ఘంటికల్ని తెలియజెప్పింది. ఇప్పటికే జిల్లా కేంద్రాన్ని రెడ్​జోన్​గా మార్చగా... ఇక నుంచి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

ఇవీ చూడండి: 'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.