సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని జీవన్‌రెడ్డి విమర్శించారు. పద్మావతి రెడ్డిని గెలిపించి ప్రశ్నించే గొంతును సభకు పంపించాలని జీవన్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తేనే హుజూర్నగర్ అభివృద్ధి కొనసాగుతుందని పద్మావతిరెడ్డి అన్నారు.
ఇవీచూడండి: ఒకే సమావేశంలో ముగ్గురు మంత్రులు... ఆసక్తికర దృశ్యాలు