సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి తరఫున మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని వ్యాఖ్యానించారు. 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 3,500 కోట్లతో అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని పద్మావతి రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో ఉత్తమ్ ఎంపీగా పోటీ చేసి గెలవడం వల్ల ఉపఎన్నిక వచ్చిందని ఆమె అన్నారు.
ఇదీ చూడండి: ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు, ఏం జరిగింది..?