గల్వన్ లోయలో చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని కలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి-సునీత దంపతులు... సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఉద్యోగ నియామక పత్రం, రూ. 5 కోట్ల చెక్కు, హైదరాబాదులో ఆరు వందల గజాల ఇంటిస్థలం తదితర అంశాలు సంతోష్ బాబు కుటుంబసభ్యులతో మంత్రి చర్చించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు రానున్నట్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం... యువకులకు స్ఫూర్తిగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103