ETV Bharat / state

అమరవీరుడి కుటుంబానికి అండగా ఉంటాం: ముఖ్యమంత్రి కేసీఆర్ - సూర్యాపేటలో కేసీఆర్

దేశరక్షణకు చివరి వరకు పోరాటం చేసి... అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సూర్యాపేటకు స్వయంగా వెళ్లిన సీఎం... సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రూ. 5 కోట్ల ఆర్థికసాయం, హైదరాబాద్‌లో నివాస స్థలం, సంతోష్ భార్యకు గ్రూప్-1 కేడర్ ఉద్యోగానికి సంబంధించిన పత్రాల్ని అందజేశారు.

Cm kcr visited colonel santhosh babu family at suryapet
అమరవీరుడి కుటుంబానికి అండగా ఉంటాం: కేసీఆర్
author img

By

Published : Jun 22, 2020, 10:14 PM IST

చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లతో కలిసి స్వయంగా సూర్యాపేటలోని ఇంటికి వెళ్లిన కేసీఆర్... ముందుగా సంతోష్‌బాబు చిత్రపటానికి పూలువేసి అంజలి ఘటించారు. అనంతరం భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. పిల్లలు, అభిజ్ఞ, అనిరుధ్ తేజలనూ పలకరించారు.

వీరుడికి వందనం..

దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందన్న కేసీఆర్... ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్‌ రెడ్డికి సూచించారు.

రూ. 5 కోట్ల చెక్కు అందజేత

సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రం, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్లు, తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్కులను అందించారు. కోటి రూపాయలను మనవరాలు అభిజ్ఞ పేరుపై డిపాజిట్ చేయాలని నానమ్మ- తాతయ్య కోరారు.

అండగా ఉంటాం..

సంతోష్‌బాబు కుటుంబానికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సూర్యాపేటలో సంతోష్‌బాబు కాంస్య విగ్రహం ఏర్పాటుచేసి... ఓ కూడలికి ఆయన పేరు పెడ్తామని ప్రకటించారు.

కృతజ్ఞతలు..

సీఎం కేసీఆర్... స్వయంగా వచ్చి పరామర్శించడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సంతోష్‌బాబు తల్లి తెలిపారు. కుటుంబానికి అండగా ఉన్న సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలని తెలిపిన సంతోష్‌బాబు భార్య... చైనాతో ఘర్షణల్లో అమరులైన ఇతర జవాన్ల కుటుంబాలకు సైతం సాయం ప్రకటించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

గట్టి బందోబస్తు..

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సూర్యాపేటలోని సంతోష్‌బాబు నివాస ప్రాంతాల్లో... గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కర్నల్ భార్య సంతోషి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.