ETV Bharat / state

కర్నల్​ సంతోష్​ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం - suryapeta latest news

భారత్‌-చైనా సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించనున్నారు. వీర సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన సీఎం... ఇచ్చిన మాట ప్రకారం కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. సీఎం సూర్యాపేటకు రానున్న దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

cm kcr going to suryapeta today for Visitation to colonel sathish babu family
కర్నల్​ సంతోష్​ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం
author img

By

Published : Jun 22, 2020, 1:09 AM IST

Updated : Jun 22, 2020, 5:37 AM IST

గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు పరామర్శించనున్నారు. విద్యానగర్‌లో నివాసముంటున్న కర్నల్ కుటుంబ సభ్యులను కలుసుకోనున్న సీఎం... ముందు ప్రకటించినట్లుగా వారి కుటుంబానికి చేయూతనివ్వబోతున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరుఫున 5 కోట్ల రూపాయల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఇంతకు ముందు కేసీఆర్​ ప్రకటించారు. స్వయంగా తానే సంతోష్ బాబు ఇంటికి వెళ్లి.. సహాయం అందించనున్నట్లు తెలిపారు.

ఆర్డీవో నియామక పత్రాలతోపాటు ఇంటిస్థలం, 5 కోట్ల నగదు

సంతోష్ సతీమణికి ఆర్డీవో నియామక పత్రాలతోపాటు ఇంటిస్థలం, 5 కోట్ల నగదు చెక్కును కేసీఆర్​ అందించనున్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగిలిన 19 మంది సైనికుల కుటుంబాలకు పదేసి లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం ఇంతకుముందే ప్రకటించారు. ఆ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని తెలిపారు. కేసీఆర్ రాక దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యాపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రికి మంత్రి జగదీశ్ రెడ్డి స్వాగతం పలుకుతారు.

సీఎం వెంట మంత్రితోపాటు ఉన్నతాధికారులు

మధ్యాహ్నానికల్లా సంతోష్ నివాసానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యానగర్ పరిసర ప్రాంతాలను ఇప్పటికే ఆదినంలోకి తీసుకున్న పోలీసులు... పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనతో కర్నల్ నివాసానికి తక్కువ సంఖ్యలో నాయకుల్ని అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా రావొద్దన్న సంకేతాలు ఇవ్వటంతో... సీఎం వెంట మంత్రితోపాటు ఉన్నతాధికారులు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

Last Updated : Jun 22, 2020, 5:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.