ETV Bharat / state

పంట కాలువల్లో రసాయన వ్యర్థాలు - musi project

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మూసి పంట కాలువల్లో రసాయన వ్యర్థ జలాలను వదులుతున్న ట్యాంకర్​ను పట్టుకున్నారు. స్థానిక సువెన్​ ఔషధ పరిశ్రమ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా... ఈ తెల్లవారు జామున ట్యాంకర్​ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్యాంకర్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

chemical-water-release-in-musi-canal-at-suryapet-district
పంట కాలువల్లో రసాయన వ్యర్థాలు
author img

By

Published : Feb 23, 2020, 10:35 AM IST

మూసికాలువలో రసాయన వ్యర్థాలను వదులుతున్న ట్యాంకర్​ను సూర్యాపేట శివారులో పోలీసులు సీజ్ చేశారు. ఈ తెల్లవారు జామున కాలుష్య జలాలను మూసీలోకి వదులుతున్న ట్యాంకర్​ను గుర్తించారు. ఏలూరు నుంచి వస్తున్నట్లు ట్యాంకర్ డ్రైవర్ పోలీసులకు తెలిపారు.

పోలీసులు ట్యాంకర్​లోని వ్యర్థ జలాలను సీసాలోకి తీసి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పంపనున్నారు. అయితే ట్యాంకర్ డ్రైవర్ మాత్రం అందులో ఏమి ఉన్నదో తనకు తెలియదని పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సువెన్​ ఔషధ పరిశ్రమ కాలుష్య జలాలను మూసి కాలువలోకి విడుదల చేస్తుందని రైతులు పలుమార్లు ఆందోళన చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకూ ఫిర్యాదు చేశారు. తమ పరిశ్రమ ఎటువంటి వ్యర్థాలను మూసీనీటిలో కలుపలేదని కాలుష్య నియంత్రణ మండలికి ఔషధ పరిశ్రమ వివరణ ఇచ్చింది.

పంట కాలువల్లో రసాయన వ్యర్థాలు

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.