సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసు, రవాణా, వైద్య, రెవిన్యూ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారిని గుర్తించి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు కొవిడ్-19 వైరస్ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
రామాపురం క్రాస్ రోడ్డు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అయినందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు నుంచి ఏపీ నుంచి వచ్చే ప్రయాణికులకూ పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ పై ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని... తగిన జాగ్రత్తలతో కొవిడ్-19ను నివారించవచ్చని కోదాడ రూరల్ సీఐ శివరాం రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ: దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న రైళ్లు