తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు, అభిమానులు సూర్యాపేట జిల్లా కోదాడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
చంద్రబాబు నాయుడికి పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై అభిమానులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. అభిమానుల కోసం ఐదు నిమిషాలపాటు చంద్రబాబు నాయుడు ఆగి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
ఇదీ చూడండి : తితిదే ఛైర్మన్‌కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ