నల్గొండలో తెరాస దాడుల(TRS attack on BJP in Nalgonda)కు ముఖ్యమంత్రి కేసీఆరే(CM KCR) సూత్రధారి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP telangana state president) ఆరోపించారు. వానాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాల్సిన వారే ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెరాస దాడుల్లో(TRS attack) 8 వాహనాలు ధ్వంసం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు.
"మా పర్యటన షెడ్యూల్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. భాజపాను అడ్డుకునేందుకు తెరాస యత్నిస్తుందని తెలిసినా పట్టించుకోలేదు. సీఎం కేసీఆరే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. వానాకాలం పంటను కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐ మధ్య ఒప్పందం జరిగింది. 8 రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోంది. అన్ని రకాల పంటలను కేంద్రమే కొనుగోలు చేస్తోంది. కమీషన్లు కూడా తీసుకుంటూ రైతులను ఎందుకు వేధిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
వరి వేస్తే రైతులను జైలుకు పంపిస్తా అన్న కలెక్టర్(siddipet former collector)ను కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ(MLC) చేస్తున్నారని బండి సంజయ్(bandi sanjay) అన్నారు. కర్షకులను ఇబ్బంది పెట్టే అధికారులను నాయకులను చేస్తున్నారంటే.. కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని చెప్పారు. అన్నదాతలపై అధికారుల దాష్టీకాన్ని ప్రేరేపించేది ముఖ్యమంత్రేనని సంజయ్ ఆరోపించారు.