రాష్ట్రంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామగా, తండ్రిగా సీఎం కేసీఆర్... ఆడపచులకు చీరెలను కానుకగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ ఏడాది రూ.317 కోట్లను ఈ కార్యక్రమం కోసం కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వేల చేనేత కుటుంబాలు 26 వేల మగ్గాలపై 8 నెలల వ్యవధిలో విభిన్నమైన రంగుల్లో 287 డిజైన్లతో కోటి బతుకమ్మ చీరలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17 వరకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.