సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో కొండముచ్చు దాడి చేయడం వల్ల ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తికి నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది. గత కొంతకాలంగా కొండముచ్చు దాడి చేయడం వల్ల పలువురికి గాయాలు అయ్యాయి. ఈ విషయంపై సంబంధిత ఫారెస్ట్ అధికారులకు, మండల అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: దుకాణంపైకి ఎక్కాడు.. పైలోకాలకు చేరాడు