సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెల్లి, గుండ్లసింగారంలో 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాభివృద్ధి కమిటీలు నడుం బిగించాయి. ఇవాళ ఉదయం కళాజాత బృందం... పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. సుమారు 100 మంది యువకులు రోడ్డు పక్కల ఉన్న పిచ్చిమొక్కలు, కంపచెట్లు తొలగించారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, కస్తుర్భా గాంధీ పాఠశాలలో శ్రమదానం చేశారు. అందరూ కలసి పనిచేస్తే త్వరితగతిన గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ బూరెడ్డి కళావతి, సర్పంచి కొచ్చర్ల బాబు, ఎంపీడీఓ నర్సింహారావు, పంచాయతీ కార్యదర్శి ఫరూఖ్, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: డెంగీ లక్షణాలతో నాలుగోతరగతి చిన్నారి మృతి