దివంగత అరుణతార రామిరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రామిరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. హుజూర్‌నగర్‌లోని రామిరెడ్డి నివాసంలో సంతాప సభ నిర్వహించారు. ఆయన మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని ఆయన అభివర్ణించారు. రామిరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని.. ఆయన ఎంతో మంది నాయకులను సమాజానికి అందించారన్నారు. ఆయన జీవిత చరిత్ర మీద భారతీయ కమ్యూనిస్టు పార్టీ చిన్న పుస్తకమును విడుదల చేస్తుందని సంస్మరణ సభ ద్వారా కమ్యూనిస్టు నాయకులకు తెలియజేశారు.
ఇవీ చూడండి: కళ్లముందే అన్యాయం.. రైతన్నల ఆగ్రహం..