కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు సూర్యపేట జిల్లా కోదాడ నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల వరకు యాత్ర నిర్వహించనున్నారు. నేడు విజయవాడ మీదుగా తెలంగాణ సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం చేరుకుని కోదాడ వరకు భాజపా శ్రేణులతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
అనంతరం కోదాడ రంగ చౌరస్తాలో జన ఆశీర్వాద యాత్రను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించానున్నారు. కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కోదాడ పట్టణం కాషాయమయమైంది. స్థానిక భాజపా కార్యకర్తలు వేదిక ఏర్పాట్లను పూర్తి చేశారు. కోదాడలో మంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు నడనున్నాయి.
తెలంగాణ సరిహద్దులో రాష్ట్ర భాజపా నాయకులు స్వాగతం పాలకనున్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కోదాడకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాజా సింగ్, రఘునందన్‌రావు, విజయశాంతి తదితర నాయకులు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
మంత్రి కిషన్‌రెడ్డి యాత్ర నేపథ్యంలో ఓయూ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడుని ముందస్తుగా అరెస్టు చేశారు. యాత్రకు భంగం కలిస్తారనే అనుమానంతో ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో తదితర నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: BJP Janashirvada Yatra: నేటి నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర