సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. తుని నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు.
ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులను మరో బస్సు ద్వారా పోలీసులు హైదరాబాద్కు తరలించారు.
ఇవీచూడండి: 'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'